‘ఆయనకి ఎవరైనా చెప్పండి ప్లీజ్‌’.. – పవన్‌కు ప్రకాష్‌రాజ్‌ కౌంటర్

'ఆయనకి ఎవరైనా చెప్పండి ప్లీజ్‌'.. - పవన్‌కు ప్రకాష్‌రాజ్‌ కౌంటర్

పవన్ కల్యాణ్‌-ప్రకాశ్‌ రాజ్‌.. వీరిద్దరి మధ్య సిల్వర్ స్క్రీన్ పై ఓ రేంజ్‌లో ఫైట్ చూసిన ప్రేక్షకులు.. ఇప్పుడు రాజకీయ రంగంలో కూడా వీరి మధ్య జ‌రిగే మాటల యుద్ధాన్ని గ‌మ‌నిస్తున్నారు. ప్రతి సందర్భంలోనూ పవన్ తూలుతున్న మాట‌ల‌పై సెటైర్లు వేయడంలో ప్రకాష్‌రాజ్‌ వెనకాడటం లేదు. తాజాగా పిఠాపురం వేదిక‌గా పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ప్ర‌కాశ్‌రాజ్ స్పందించిన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది.

జ‌స్ట్ ఆస్కింగ్‌ ట్యాగ్‌తో రిప్లై
హిందీ భాష, తమిళ సినిమాల డబ్బింగ్‌పై పవన్‌ చేసిన కామెంట్స్‌కు ప్రకాష్‌ రాజ్‌ కౌంటర్ ఇచ్చారు. “తమిళ సినిమాలను హిందీలోకి డబ్ చేయొద్దని” పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. “మీ హిందీ భాషను మా మీద రుద్దకండి.. ఇది ఇంకో భాషను ద్వేషించడం కాదు. స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడమే,” అంటూ పవన్‌ కల్యాణ్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్‌.. అంటూ ట్వీట్ చేశారు. #justasking హ్యాష్‌ట్యాగ్‌తో చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.

ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌పై నెటిజన్లు స్పందిస్తున్నారు. విజ్ఞ‌త‌తో త‌మిళనాడు రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను అర్థం చేసుకున్న వారంతా ప్ర‌కాశ్ రాజ్‌కు మ‌ద్ద‌తుగా నిలుస్తుండ‌గా, పవన్ ఫ్యాన్స్ మాత్రం ప్రకాష్‌ రాజ్‌ను టార్గెట్ చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ఈ వివాదం మరింత హీటెక్కుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment