పైడిపల్లి ప్రాజెక్ట్ .. పవన్ మళ్లీ వెయిట్ చేయాల్సిందేనా?

పైడిపల్లి ప్రాజెక్ట్ .. పవన్ కళ్యాణ్ మళ్లీ వెయిట్ చేయాల్సిందేనా?

పవన్ కళ్యాణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందనే ప్రచారం గత కొంతకాలంగా జరిగింది. హిందీలో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లకు కథ వినిపించిన తర్వాతే, వంశీ పైడిపల్లి పవన్ కళ్యాణ్‌ను ఒప్పించారని వార్తలు వచ్చాయి.

అయితే, తాజా సమాచారం ప్రకారం, సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో, సల్మాన్ చేయరనుకున్న కథతో పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలనుకున్న ప్రాజెక్ట్ ప్రస్తుతానికి నిలిచిపోయినట్లు (Hold) తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ ఒప్పుకోవడంతో, వంశీ పైడిపల్లి అదే కథను పవన్ కళ్యాణ్‌తో తీసే అవకాశం లేదు. పవన్ కళ్యాణ్ కోసం వంశీ పైడిపల్లి కొత్త కథ సిద్ధం చేస్తారా లేదా అనేది ప్రస్తుతానికి స్పష్టత రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment