క‌ళ్యాణ్ బాబు విలువ‌లు మాట్లాడుతారు.. కానీ, పాటించ‌రా..?

క‌ళ్యాణ్ బాబు విలువ‌లు మాట్లాడుతారు.. కానీ, పాటించ‌రా..?

త‌న‌ను, త‌న కుటుంబాన్ని నాలుగు ద‌శాబ్దాలుగా స్టార్ హోదాలో నిల‌బెట్టి, గొప్ప ఐడెంటిటీ ఇచ్చిన మాతృరంగానికి టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్‌, ఏపీ(AP) డిప్యూటీ సీఎం (Deputy CM) ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ద్రోహం చేస్తున్నారు. నిత్యం విలువ‌ల గురించి మాట్లాడే ప‌వ‌న్‌.. త‌నకు స్టార్‌డ‌మ్ ఇచ్చి, దేశానికి ప‌రిచ‌యం చేసిన రంగంలోని కార్మికులను (Workers) రోడ్డున ప‌డేస్తున్నారు. ఇది మ‌నం అనుకునే మాట కాదు.. ఏకంగా సినీ రంగానికి చెందినవారే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ఫైర్ అవుతూ చేస్తున్న కామెంట్స్‌. టాలీవుడ్‌లో పెద్ద కుటుంబంగా (10 మంది హీరోలు) ఉన్న మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చి అగ్ర క‌థానాయ‌కుడిగా ఉన్న‌ ప‌వ‌న్ క‌ళ్యాణే త‌మ‌కు తీర‌ని అన్యాయం చేస్తున్నాడ‌ని ఆగ్ర‌హంతో ఊగిపోతుండ‌డం గ‌మ‌నార్హం.

పవన్ కళ్యాణ్ షూటింగ్‌కు ముంబై (Mumbai) నుంచి సినీ కార్మికులను (Film Workers) ఇంపోర్ట్ చేసుకోవ‌డం టాలీవుడ్‌లో తీవ్ర‌ దుమారం రేపింది. ఒక‌వైపు వేతనాల పెంపుకోసం సినీ కార్మికులు న్యాయ‌ప‌రంగా ఆందోళ‌న చేప‌ట్ట‌గా, కార్మికుల ఆందోళ‌న‌కు ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వ‌కుండా త‌న ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సినిమా షూటింగ్ కోసం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముంబై నుంచి కార్మికుల‌ను రప్పించుకున్నారు. బంద్‌లో ఉన్న టాలీవుడ్ కార్మికుల స‌మ‌స్య‌ల గురించి ప‌ట్టించుకోకుండా బాలీవుడ్ నుంచి సినిమా వ‌ర్క‌ర్ల‌ను ర‌ప్పించుకొని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో త‌న సినిమా షూటింగ్‌ను కొన‌సాగిస్తున్నాడు.

అయితే నిర్మాణ సంస్థ వారిని పిలిపించిన‌ప్ప‌టికీ.. నిత్యం విలువ‌లు, కార్మికుల స‌మ‌స్య‌లు త‌న‌కు తెలుసు అని వేదిక‌ల‌పై మాట్లాడే ప‌వ‌న్ క‌ళ్యాణ్.. మాతృరంగంలోని కార్మికుల బంద్ పిలుపును ప‌ట్టించుకోకుండా షూటింగ్‌లో పాల్గొన‌డంపై కార్మికులు మండిప‌డుతున్నారు. ముంబై కార్మికులతో షూటింగ్ జరుపుతున్న పవన్ కళ్యాణ్‌పై, మైత్రి సంస్థపై సినీ కార్మికులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. తన‌కు స్టార్ హోదాను క‌ల్పించిన సినీ ప‌రిశ్ర‌మ కార్మికుల స‌మ‌స్య‌పైనే శ్ర‌ద్ధ చూప‌ని ప‌వ‌న్‌.. ఇక‌ ప్ర‌జల జీవితాల‌ను ఎలా చ‌క్క‌దిద్దుతారంటూ ప్ర‌శ్న‌లు సైతం వినిపిస్తున్నాయి.

ఫిలిం ఛాంబర్ వ‌ద్ద ఆందోళ‌న‌
కాగా, 30 శాతం వేత‌నాలు పెంచాల‌న్న సినీ కార్మికుల బంద్‌ పిలుపుపై టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని నిర్మాత‌లు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డారు. ఫిలిం ఛాంబ‌ర్‌లో స‌మావేశ‌మ‌య్యారు. ఈ మీటింగ్‌కు నిర్మాతలు అల్లు అరవింద్, దిల్‌రాజు, మైత్రి రవి, సురేష్ బాబు, శివలెంక కృష్ణప్రసాద్, రాధామోహన్, బాపినీడు, ఠాగూర్ మధు, ఫెడరేషన్ సభ్యులు, ఫిలిం ఛాంబర్ సభ్యులు హాజ‌ర‌య్యారు. 30% వేతనాలు పెంచాలని నిరసనకు దిగిన సినీరంగ ఉద్యోగులు, కార్మికులు.. ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. లోప‌లికి చొచ్చుకు వెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment