ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దక్షిణాది పర్యటనను ప్రారంభించారు. ఈరోజు హైదరాబాద్ నుంచి బయల్దేరి కేరళలోని కొచ్చి విమానాశ్రయానికి చేరుకున్న పవన్, అక్కడి నుంచి దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించనున్నారు.
మొదటి కొచ్చిలోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను పవన్ కల్యాణ్ సందర్శించనున్నారు. మూడు రోజుల పాటు దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ పర్యటన కొనసాగనుంది.
గత 15 రోజులుగా అధికారిక కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు. కేబినెట్ సహా, నిన్న (మంగళవారం) జరిగిన మంత్రులు, కార్యదర్శుల సమావేశానికి గైర్హాజరయ్యారు. ఇవాళ ఉదయం సనాతన ధర్మ పరిరక్షణ యాత్రకు బయల్దేరి వెళ్లారు.








