ప‌వ‌న్‌కు కేంద్రం నుంచి షాక్‌.. డీఎస్పీకి ప్రతిష్టాత్మక అవార్డు

ప‌వ‌న్‌కు కేంద్రం నుంచి షాక్‌.. డీఎస్పీకి ప్రతిష్టాత్మక అవార్డు

పశ్చిమ గోదావరి జిల్లా పోలీస్‌ శాఖలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవ‌ల డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్  (Pawan Kalyan) విచార‌ణ‌కు ఆదేశించిన‌ భీమవరం (Bhimavaram) డీఎస్పీ(DSP) జయసూర్య (Jayasurya)కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అవార్డు (Prestigious Award) ప్రకటించింది. సమర్థులైన అధికారులుగా గుర్తించిన కేంద్ర హోంశాఖ, రాష్ట్రం నుండి ఎస్పీ నయీం, ఏసీపీ భీమారావు, డీఎస్పీ జయసూర్య, ఎస్సై నజీరుల్లాలను అవార్డుల కోసం ఎంపిక చేసింది. ముఖ్యంగా ‘డెడ్ బాడీ డెలివరీ’ కేసు పరిష్కారంలో డీఎస్పీ జయసూర్య ప్రదర్శించిన ప్రావీణ్యం, క్రమశిక్షణను ప్రశంసిస్తూ ఈ గౌరవం వరించింది.

ఇక ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల భీమవరం డీఎస్పీ జయసూర్యపై విచారణ జరపాలని జిల్లా ఎస్పీకి ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఈ అవార్డు ప్రకటన షాక్‌గా మారింది. ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో డీఎస్పీపై విచారణ కొనసాగుతుండగా, కేంద్రం ఇచ్చిన ఈ గుర్తింపు అనూహ్య మలుపు తిప్పింది.

ఇదే సమయంలో, భీమవరం డీఎస్పీ జయసూర్య పనితీరుపై కూట‌మి ప్ర‌భుత్వంలోని ప్రజాప్రతినిధులు కూడా సానుకూల అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇటీవ‌ల‌ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కూడా జయసూర్యను “వెరీ గుడ్ ఆఫీసర్” అని ప్రశంసించిన విషయం తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment