ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన తోడబుట్టిన అన్న నాగబాబు కోసం భారీ త్యాగమే చేయనున్నారట. ఇప్పటికే సీఎం చంద్రబాబు జనసేన నాయకుడు నాగబాబుకు మంత్రి పదవి ఇస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు. నాగబాబుకు ఏ శాఖ కేటాయించాలనే అంశంపై చర్చించినట్లుగా సమాచారం.
కాగా, నాగబాబుకు శాఖ కేటాయింపులో చంద్రబాబు ఒక మెలిక పెట్టినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేశ్ నిర్వర్తిస్తున్న టూరిజం, సినిమాటోగ్రఫీ శాఖలను నాగబాబుకు బదలాయించాలని నిర్ణయించారంట.
అత్యంత సన్నిహితుడైన కందుల దుర్గేశ్‌కు పవన్ కళ్యాణ్ తన వద్ద ఉన్న గ్రామీణాభివృద్ధి లేదా అటవీ పర్యావరణ శాఖల్లో ఏదో ఒకటి విడిచిపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారట. ఈ నిర్ణయం ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్‌గా మారింది.