పవన్ కళ్యాణ్ 24 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన బ‌న్నీ

పవన్ కళ్యాణ్ 24 ఏళ్ల రికార్డ్‌ను బ్రేక్ చేసిన బ‌న్నీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సంచలన విజయాన్ని సాధించింది. సినిమా విడుదలై రెండు నెలలు గడిచినా, దాని క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఓటీటీలో విడుదలైనప్పటికీ, పలు థియేటర్లలో ఇప్పటికీ మంచి వసూళ్లు సాధిస్తోంది.

ఇక ఇప్పుడు మరో రికార్డును బద్దలు కొట్టారు బన్నీ. పవన్ కళ్యాణ్ 24 ఏళ్ల కిందట అందుకున్న ఘనతను అధిగమించాడు. హైదరాబాద్‌లోని ప్రసిద్ధి గాంచిన‌ సంధ్య థియేటర్‌లో పవన్ కళ్యాణ్ నటించిన ఖుషీ చిత్రం రూ.1.56 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించగా, తాజాగా పుష్ప-2 సినిమా రూ.1.59 కోట్లు వసూలు చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. సంధ్య థియేట‌ర్‌లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా పుష్ప‌-2 రికార్డుల‌కెక్కింది.

ఈ రికార్డ్ బ్రేక్‌తో అల్లు అర్జున్ పాపులారిటీ ఇంకా పెరిగిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. పుష్ప 2 విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతుండటంతో, మరిన్ని రికార్డులు బద్దలయ్యే అవకాశముందని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment