ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు ముస్లిం సమాజంలో (Muslim Community) తీవ్ర నిరసనకు కారణమయ్యాయి. “ముస్లింలు ఉగ్రవాదులు” అని పవన్ వ్యాఖ్యలు చేశారని సంగారెడ్డి (Sangareddy) జిల్లా జహీరాబాద్ పోలీసు స్టేషన్ (Police Station)లో ముస్లిం యువకులు ఫిర్యాదు చేశారు. జహీరాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఖాజా (Khaja) ఆధ్వర్యంలో ఎస్.ఐ కాశీనాథ్‌కు (SI-Kashinath) ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు.
ఈ సందర్భంగా ముస్లిం యువకులు మాట్లాడుతూ పవన్ కల్యాణ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వందశాతం ముస్లింలు (Muslims) ఉగ్రవాదులే (Terrorists) అని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తప్పని ఆరోపించారు. ఇస్లాంకు ఉగ్రవాదంతో సంబంధం లేనిది, ఇది శాంతి, ప్రేమకు సంబంధించిన మతమని స్పష్టం చేశారు. టోపీలు, గడ్డాలు, కుర్తాలు, స్కార్ప్‌లను ఉగ్రవాదానికి చిహ్నాలుగా ప్రదర్శిస్తున్నారని, పవన్ కల్యాణ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాము కోరుకుంటున్నాం అని స్పష్టం చేశారు.








