ఈనెల 24వ తేదీన జనసేన అధినేత మరియు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్ పర్యటన కేవలం అధికారిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా, జనసేన పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాల ద్వారా పార్టీకి సంబంధించిన వ్యూహాలు, పథకాలు చర్చకు వస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జనసేనకు ప్రాధాన్యత
పవన్ కల్యాణ్ పిఠాపురం పర్యటనను జనసేన కార్యకర్తలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పర్యటనలో ప్రాంతీయ సమస్యలు, అభివృద్ధి చర్యలు, జనసేన వ్యూహాలు ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. సంక్రాంతికి ముందు పవన్ పిఠాపురంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను అక్కడి నుంచే ప్రారంభించారు. ఈనెలలో మరోసారి పిఠాపురం వెళ్తుండటంతో జనసేన శ్రేణుల్లో ఆసక్తి నెలకొంది.








