పవన్ సినిమాకు షాక్.. ‘ఓజీ’ షోలు రద్దు..

'ఓజీ' సినిమాకు షాక్.. పవన్ కళ్యాణ్ మూవీ షోలు రద్దు..

పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాకు ఓవర్సీస్ మార్కెట్‌లో షాక్ తగిలింది. సినిమా విడుదల కావడానికి రెండు రోజుల ముందే నార్త్ అమెరికాలో అన్ని షోలు రద్దయ్యాయి. ఈ విషయాన్ని అక్కడ అతిపెద్ద డిస్ట్రిబ్యూటర్ అయిన యార్క్ సినిమాస్ అధికారికంగా ప్రకటించింది. నార్త్ అమెరికాలో ‘ఓజీ’ సినిమాను పంపిణీ చేస్తున్న వారి “అరాచకాలు, అనైతిక చర్యల” కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యార్క్ సినిమాస్ పేర్కొంది.

యార్క్ సినిమాస్ ఆరోపణలు

యార్క్ సినిమాస్ తమ ప్రకటనలో కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేసింది. ‘ఓజీ’ డిస్ట్రిబ్యూటర్లు తమ సినిమా అమ్మకాలను పెంచమని యార్క్ సినిమాస్‌పై ఒత్తిడి తెచ్చారని, భవిష్యత్తులో విడుదలయ్యే దక్షిణాసియా సినిమాల విలువను పెంచుకోవడానికి ఇలా ప్లాన్ చేశారని ఆరోపించారు. కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సామాజిక, రాజకీయ వర్గాలతో సంబంధాలు పెట్టుకుని ఉత్తర అమెరికాలో సాంస్కృతిక విభేదాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, అలాంటి అనైతిక పద్ధతులను తాము వ్యతిరేకిస్తామని యార్క్ సినిమాస్ స్పష్టం చేసింది. తమకు ప్రజల భద్రతే ముఖ్యం అని, ప్రీ-బుకింగ్ చేసుకున్న వారందరికీ డబ్బులు తిరిగి ఇస్తామని తెలిపింది.

Join WhatsApp

Join Now

Leave a Comment