డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పెద్ద వివాదానికి దారితీసింది. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పెట్టిన ఈ ఫ్లెక్సీలో ఉన్న వ్యాఖ్యలపై స్థానిక దళిత సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలో “మీరెంత.. మీ స్థాయి ఎంత.. రోడ్ల మీద పండేస్తాం.. కొడల్లారా” అనే కోటేషన్ రాయడంతో వాతావరణం వేడెక్కింది.
దళిత సంఘాల ప్రతినిధులు ఆ ఫ్లెక్సీని చించి పడేసి నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మరింత చర్చనీయాంశమవుతున్నాయి. వివాదాస్పద వ్యాఖ్యలతో ఉన్న ఫ్లెక్సీపై దళిత సంఘాలు “విద్వేషపూరిత వ్యాఖ్యలు అంగీకారంలేవు” అంటూ మండిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనపై స్థానికంగా రాజకీయ చర్చలు జోరందుకున్నాయి.
కోనసీమ జిల్లాలో @PawanKalyan ఫ్లెక్సీ రగడ
— Telugu Feed (@Telugufeedsite) September 2, 2025
''మీరెంత.. మీ స్థాయి ఎంత.. రోడ్ల మీద పండేస్తాం.. కొడల్లారా'' అంటూ కొటేషన్ @JanaSenaParty ఫ్లెక్సీ
విద్వేషపూరిత కొటేషన్లపై దళిత సంఘాల ఆగ్రహం..
వివాదాస్పద ఫ్లెక్సీని చించేసిన దళిత సంఘాల ప్రతినిధులు pic.twitter.com/wI4Gv0B8yh








