టాలీవుడ్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం తన తాజా సినిమా “ఓజీ” గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓజీ అంటే అర్థం ఏమిటో ఆయన చెప్పారు. ఒక మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సినిమా పేరుకు వెనుక ఉన్న అర్థాన్ని, కథ నేపథ్యాన్ని వివరించారు.
ఓజీ 1980-90ల మధ్య జరిగిన కథ ఆధారంగా రూపొందుతుందట. OG అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని అర్థం అంటూ పవన్ వివరించారు. ఈ సినిమా టైటిల్‌ను అభిమానులు చాలా ఎగ్జైట్‌మెంట్‌తో స్వీకరించారని, అందుకే ‘OG OG’ అని వారు చప్పట్లు కొడుతుంటే, అవి ఒక విధంగా తనకు ప్రెజర్ లాగా అనిపించాయి అని పవన్ అభిప్రాయపడ్డారు.
ఇక తన కమిట్‌మెంట్ల గురించి కూడా స్పందించిన పవన్.. తాను ఒప్పుకున్న అన్ని ప్రాజెక్టులకు డేట్స్ కేటాయించాను అని, ‘హరిహర వీరమల్లు’ కోసం ఇంకా ఎనిమిది రోజుల షూటింగ్ మిగిలి ఉంది అని స్పష్టం చేశారు.
ఓజీ సినిమాకు సుజిత్ దర్శకత్వం వహిస్తుండగా డీవీవీ ధానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా శ్రియారెడ్డి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్‌రాజ్, అజయ్ ఘోష్ కూడా నటిస్తున్నారు.