రాజమండ్రిలో జరిగిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అభిమానులు మృతిచెందారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతిచెందిన ఇద్దరు అభిమానులు మణికంఠ, చరణ్ కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పరిహారం ప్రకటించారు. ఈవెంట్‌కు హాజరై తిరిగివెళ్తూ మృతిచెందిన ఇద్దరు అభిమానుల కుటుంబాలకు జనసేన తరఫున రూ.5లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు.
ఇళ్లకు సురక్షితంగా వెళ్లాలని ఈవెంట్లో ఒకటికి రెండుసార్లు తాను చెప్పినట్లు పవన్ గుర్తుచేశారు. ప్రమాదం జరిగిన కాకినాడ-రాజమండ్రి రోడ్డులో విపరీతమైన గుంతలు ఉన్నాయని, ఇక నుంచి పిఠాపురం పర్యటనకు గోతులతో కూడిన ఏడీబీ రోడ్డు గూండానే వెళ్లాలనని నిర్ణయించుకున్నట్లు పవన్ తెలిపారు.
అదే విధంగా గేమ్ ఛేంజర్ చిత్ర నిర్మాత దిల్ రాజు మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఒక్కొక్క అభిమాని కుటుంబానికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి.