డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సోమవారం విశాఖపట్నం జిల్లా పెందుర్తి (Pendurthi) లో పర్యటించారు. అయితే, పవన్ కల్యాణ్ కాన్వాయ్ (Convoy) కారణంగా JEE అడ్వాన్స్ పరీక్ష రాయాల్సిన విద్యార్థులకు (Students) ఆలస్యమైంది. పెందుర్తి అయాన్ డిజిటల్ (Ayaan Digital) JEE అడ్వాన్స్ విద్యార్థులు ఆలస్యంగా పరీక్షా కేంద్రానికి వెళ్లడంతో ఎగ్జామ్ సెంటర్ నిర్వాహకులు 30 మందిని వెనక్కి పంపించారు. ఎంట్రీ గేట్లు మూసేసిన అధికారులు, విధిగా నిబంధనల ప్రకారం, ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను లోపలికి అనుమతించలేదు. దీంతో పరీక్షకు హాజరుకాలేక పోయిన విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు (Parents) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కోసం ట్రాఫిక్ (Traffic) నిలిపివేయడంతో JEE అడ్వాన్స్ పరీక్షలకు తమ పిల్లలకు దూరం అయ్యారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
పవన్ కాన్వాయ్ మూలంగా పరీక్ష ఆలస్యమైందని, తన కుమారుడి భవిష్యత్తు (Future) అంధకారంలోకి నెట్టారని ఓ విద్యార్థి తల్లి కన్నీరు పెట్టుకుంది. పిల్లల భవిష్యత్తును నాశనం చేశారంటూ విద్యార్ధుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చిన్నారుల భవిష్యత్తు వారు, తమ పిల్లల భవిష్యత్తు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 30 మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేసిన అధికారులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.







