మార్చురీలో ఘోరం.. కార్టన్ బాక్స్‌ల్లో పాశమైలారం మృత‌దేహాల అవ‌య‌వాలు

మార్చురీలో ఘోరం.. కార్టన్ బాక్స్‌ల్లో పాశమైలారం మృత‌దేహాల అవ‌య‌వాలు

పాశమైలారం (Pashamylaram) సిగాచి ఇండస్ట్రీస్ (Sigachi Industries) ఫార్మా యూనిట్‌ (Pharma Unit)లో జరిగిన భారీ పేలుడు (Massive Explosion) ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 40 మంది మృతి చెందగా, 20 మంది ఆచూకీ తెలియలేద‌ని అధికారులు తెలిపారు. అయితే, పటాన్‌చెరు (Patancheru) ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) మార్చురీ (Mortuary)లో మృతదేహాల (Dead Bodies) అవయవాలను (Organs) కార్టన్ బాక్స్‌ (Carton Box)లో ఉంచిన ఘటన తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రి యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్టన్ బాక్స్‌ల్లో మృతదేహాల అవయవాలు
పాశమైలారం ప్రమాదంలో మృతదేహాలు తీవ్రంగా కాలిపోవడంతో చాలా వరకు గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో 36 మృతదేహాలను తీసుకొచ్చినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి (Dr.Srinivas Reddy) తెలిపారు. వీటిలో 14 మృతదేహాలు గుర్తించగా, మిగిలిన వాటి గుర్తింపు కోసం డీఎన్ఏ(DNA) పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే, కొన్ని మృతదేహాల అవయవాలను కార్టన్ బాక్స్‌లలో ఉంచినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఆసుపత్రి, ప్రభుత్వంపై ఆగ్రహం
పాశమైలారం ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కార్మికులు ఉన్నారు. మృతదేహాలను గుర్తించడానికి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్ద గుమిగూడారు. అయితే, కార్టన్ బాక్స్‌లో అవయవాలను సంరక్షించడం, సరైన సమాచారం అందించకపోవడం వంటి విషయాలపై కుటుంబ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రభుత్వం, సిగాచి యాజమాన్యం స్పందన
సిగాచి ఇండస్ట్రీస్ యాజమాన్యం బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించినప్పటికీ, మృతదేహాల గుర్తింపు, అవయవాల సంరక్షణలో జరిగిన లోపాలపై స్పష్టమైన వివరణ ఇవ్వలేదు. ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడుతూ “గుర్తించని మృతదేహాల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించాము. 18 మంది బంధువుల నుంచి కూడా నమూనాలు తీసుకున్నాం. మూడు నుంచి ఏడు రోజుల్లో ఫలితాలు వస్తాయి” అని తెలిపారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా ఆదేశాల మేరకు ఫోరెన్సిక్ నిపుణులు డీఎన్ఏ పరీక్షలను వేగవంతం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment