---Advertisement---

2025లో భారత్‌లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్

2025లో భారత్‌లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్
---Advertisement---

ప్రపంచ స్థాయి క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు మ‌రోసారి భార‌త్ రెడీ అవుతోంది. 2025లో పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ ఢిల్లీలోని నెహ్రూ స్టేడియంలో జరగనున్నాయి. ఇది భారత్‌లో జరిగే మొదటి పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ కాగా, 100 దేశాల నుంచి 1000 మంది అథ్లెట్లు ఈ ఘనమైన కార్యక్రమంలో పాల్గొంటారు.

విశేషాలు..
ఈ ఈవెంట్ 2025 సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 5 వరకు జరుగుతుంది.
ఇది 2036 ఒలింపిక్స్ నిర్వహణ ప్రతిపాదనను బలపరుస్తుందని NPC ఇండియా అభిప్రాయపడింది.
మార్చి 11-13 మధ్య వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ కూడా ఢిల్లీలో జరగనుంది.

ఈ పారా అథ్లెటిక్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లకు తమ ప్రతిభను ప్రదర్శించడానికి గొప్ప అవకాశం కల్పిస్తుంది. అలాగే, ఈ క్రీడా కార్యక్రమం భారత్ క్రీడా రంగంలో మరో పెద్ద అడుగు వేయడమే కాక, దేశంలో ఒలింపిక్స్ 2036 నిర్వహణను కూడా కీలకమైనది.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment