ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా, యువతకు ఉపాధి ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్ దేశంలోని దావోస్ నగరానికి బయల్దేరింది. ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు దావోస్‌లో పర్యటించిన వార్త కథనాలు సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. 2014-19 మధ్య చంద్రబాబు దావోస్ పర్యటనకు వెళ్లి రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చారో చెప్పాలని ప్రతిపక్ష వైసీపీ డిమాండ్ చేస్తోంది. ప్రచారం ఆర్భాటం తప్ప.. ఈ వార్తా కథనాల్లో అచ్చేసిన పరిశ్రమలు ఎన్ని వచ్చాయో లెక్కేసి చెప్పగలరా..? అని ప్రశ్నిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Click Here: దావోస్ పర్యటన.. ‘చంద్రబాబు గతం గుర్తులు’ వైరల్