‘పంచాయత్- సీజన్ 5’ రెడీ.. ఎప్పుడో తెలుసా?

‘పంచాయత్- సీజన్ 5’ రెడీ.. ఎప్పుడో తెలుసా?

ప్రజాదరణ పొందిన వెబ్ సిరీస్ ‘పంచాయత్’ (Panchayat) కొత్త సీజన్‌ కు రెడీ అయింది. అమెజాన్ ప్రైమ్ (Amazon Prime) వీడియో ఈ సీరీస్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. ‘పంచాయత్- సీజన్ 5’ (Season 5)ని అధికారికంగా ప్రకటిస్తూ 2026లో స్ట్రీమింగ్‌ (Streaming)కు తీసుకురాబోతున్నామని వెల్లడించింది.

ఇప్పటికే నాలుగు సీజన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సిరీస్, చిన్న పట్టణ జీవితం, అక్కడి నయా నయా సమస్యలను హాస్యంతో మిళితం చేస్తూ చూపించి విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఐదో సీజన్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో చేసిన ఈ అప్‌డేట్ పట్ల సోషల్ మీడియాలో భారీ రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా లాస్ట్ సీజన్ ఎక్కడ ముగిసిందో గుర్తు ఉంటే, కొత్త సీజన్‌లో ఏం జరుగుతుందో అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment