పెళ్లి పేరుతో యువ‌తుల‌కు వ‌ల‌.. హైదరాబాద్‌లో పాకిస్థానీ యువకుడి మోసం

పెళ్లి పేరుతో యువ‌తుల‌కు వ‌ల‌.. హైదరాబాద్‌లో పాకిస్థానీ యువకుడి మోసం

హైదరాబాద్‌ (Hyderabad)లో జ‌రిగిన‌ సంచలనాత్మక ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వచ్చింది. బంజారాహిల్స్ (Banjara Hills) మౌంట్ (Mount) బంజారా కాలనీ (Banjara Colony)లో నివాసం ఉంటున్న పాకిస్థాన్‌ (Pakistan)కు చెందిన ఫహద్ (Fahad) అనే యువకుడు, ప్రేమ పేరుతో యువ‌తిని వ‌శ‌ప‌రుచుకొని, ఆమె మతం మార్చి, బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన త‌రువాత మ‌రో మహిళ(Women)తో అనైతిక సంబంధాల కొన‌సాగిస్తూ అడ్డంగా బుక్కయ్యాడు.

వివ‌రాల్లోకి వెళితే.. 2016 మార్చిలో కీర్తి(Keerthi) అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న పాకిస్థాన్‌కు చెందిన‌ ఫహద్, వివాహం అనంతరం ఆమె మ‌తం మార్చి, పేరును దోహా ఫాతిమా (Doha Fatima)గా మార్చాడు. ఇద్దరూ హైటెక్ సిటీలోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పరిచయం అయ్యారు. పెళ్లి తర్వాత బంజారాహిల్స్‌లో నివసిస్తుండగా, ఫహద్ తన ఆఫీస్‌లో మరో మహిళతో ఉన్నట్లు రెడ్‌హ్యాండెడ్‌గా భార్య పట్టుకుంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫహద్, ఆ మహిళ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో, 1988లో ఫహద్ హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడిన విషయం, అలాగే పలు మహిళలను ప్రేమ పేరుతో మోసగించి, మతం మార్చించి, డబ్బులు దోచుకున్నట్టు బయటపడింది. బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ, పెళ్లి తరువాత తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని, తన కూతురును కూడా బలవంతంగా మతం మార్చాడని ఆరోపించింది. అంతేకాకుండా, తన పేరు మీద రూ.20 లక్షల వరకు లోన్ తీసుకున్నట్టు తెలిపింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన తనిఖీల్లో ఫహద్ పాకిస్థానీ పౌరుడని అధికారులకు స్పష్టమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment