రాజస్థాన్ (Rajasthan) లోని ఫోర్ట్ అబ్బాస్ (Fort Abbas) సరిహద్దులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. శనివారం ఉదయం పొరుగు దేశం పాకిస్తాన్ (Pakistan) కు చెందిన ఓ రేంజర్ (Ranger) భారత్ (India) భూభాగంలోకి అక్రమంగా ప్రవేశించిన నేపథ్యంలో, భారత సరిహద్దు భద్రతా దళాలు (Indian Border Security Forces) అతన్ని అదుపులోకి (Custody) తీసుకున్నాయి. ఇటీవల కశ్మీర్ (Kashmir)లోని పహల్గామ్ (Pahalgam)లో జరిగిన ఉగ్రదాడి (Terror Attack) కారణంగా ఇప్పటికే భారత్–పాకిస్తాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజా అరెస్టు మరింత సంచలనంగా మారింది. పహల్గామ్ దాడి అనంతరం, పాకిస్తాన్ ఐఎస్ఐ చీఫ్ (Pakistan ISI Chief) అసిమ్ మునీర్ (Asim Munir)ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించింది. మరోవైపు, పాక్‌తో వాణిజ్య, దౌత్య సంబంధాలు తెంచుకొని ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశానికి భారత్ గట్టి సమాధానమిచ్చింది. ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు మద్దతు వెల్లువెత్తుతోంది.
బీఎస్ఎఫ్‌కు దుర్బాషలాడిన పాక్ రేంజర్
బీఎస్ఎఫ్ వర్గాల ప్రకారం.. పాకిస్తాన్ రేంజర్ పాక్ భూభాగాన్ని వదిలి భారతదేశంలోకి ప్రవేశించాడు. సరిహద్దులో భారత సైనికులను, పోలీసులను చూసి దుర్భాషలాడాడు. దీంతో భారత సరిహద్దు భద్రతా దళాలు వెంటనే స్పందించి అతన్ని అరెస్ట్ (Arrest) చేశాయి. ఈ విషయం పాకిస్తాన్‌కు తెలియగానే అక్కడ హడావుడి మొదలైంది. తమ రేంజర్‌ను విడిపించేందుకు పాకిస్తాన్ సరిహద్దు దళాలు ఫ్లాగ్ మీటింగ్ (Flag Meeting)కు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే బీఎస్ఎఫ్ (BSF) ఇప్పటివరకు అతని విడుదలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఇంకా పెండింగ్‌లో పూర్ణమ్ సాహు అంశం
ఏడురోజుల క్రితం పాకిస్తాన్ సైనికులు భారత బెంగాలీ సైనికుడు పూర్ణమ్ సాహును (Purnam Sahu) అరెస్ట్ చేశారు. ఆయన సరిహద్దు దాటి పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లాడు. ఫ్లాగ్ మీటింగ్ జరిగినా ఇప్పటివరకు అతన్ని విడుదల చేయలేదు. పూర్ణమ్ సాహు కుటుంబ సభ్యులు అతని ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు.