భారత్‌పై పాక్ మరో దాడి.. పంజాబ్‌లో క్షిప‌ణి శ‌క‌లాలు

భారత్‌పై పాక్ మరో దాడి.. పంజాబ్‌లో క్షిప‌ణి శ‌క‌లాలు

ఆప‌రేష‌న్‌ సింధూర్‌ (Operation Sindhoor) తో ఉగ్ర‌వాదాన్ని (Terrorism) ప్రోత్స‌హిస్తున్న పాకిస్తాన్‌ (Pakistan)కు భార‌త్ (India) గ‌ట్టి గుణ‌పాఠం చెప్పింది. భార‌త ఆర్మీ (Indian Army) చేప‌ట్టిన మిస్సైల్ దాడి (Missile Attack)లో 100 మంది పాక్ ఉగ్ర‌వాదాలు మృతిచెందారు (Killed). అయినా పాక్ కుటిల బుద్ధి మార‌లేదు. భారత్‌పై పాకిస్తాన్ మరోసారి దాడికి తెగబడింది. పాక్ దాడులను భారత్ బలగాలు బ‌లంగా తిప్పికొట్టాయి. పాక్ మిస్సైల్‌ను గాల్లోనే ధ్వంసం (Destroyed) చేసింది.

లాహోర్‌ (Lahore) లో ఎయిర్ డిఫెన్స్ యూనిట్ల (Air Defense Units)తో పాకిస్తాన్ భార‌త్‌పై దాడి ప్ర‌య‌త్నించింది. పాక్ దాడిని ముందుగానే ప‌సిగ‌ట్టిన భార‌త ఆర్మీ పాక్ క్షిపణులను కూల్చివేసింది. పాక్ మిస్సైల్స్ ను గగనతలంలోనే భార‌త భ‌ద్ర‌త బ‌ల‌గాలు పేల్చేశాయి. భార‌త‌దేశ స‌రిహ‌ద్దు ప్రాంతాలైన జ‌మ్మూక‌శ్మీర్‌, పంజాబ్, రాజస్థాన్ లక్ష్యంగా చేసుకొని పాక్ దాడులకు పాల్ప‌డినట్లుగా తెలుస్తోంది. భారత్‌లోని 15 సైనిక పోస్టులపై పాక్ దాడులు చేప‌ట్టింది. పంజాబ్ వ్యవసాయ భూముల్లో పాక్ క్షిప‌ణుల‌ శకలాలు (Pakistan Missile Fragments) ల‌భించాయి. భారత సైనిక స్థావరాలపై దాడి చేస్తే ప్రతిదాడులు తప్పవని పాక్‌కు ఇండియ‌న్ ఆర్మీ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

ఆపరేషన్ సింధూర్ విజ‌య‌వంతం త‌రువాత పంజాబ్‌ (Punjab) లోని ప‌లు ప్రాంతాలలో పేలుళ్లు సంభవించినట్లు, పొలాల్లో తెలియని పరికరాలు పడిపోయి ఉన్న‌ట్లు నివేదికలు వచ్చాయి. పంజాబ్‌లోని అకాలియా గ్రామంలోని గోధుమ తోటలో మంగళవారం రాత్రి భారీ పేలుడు సంభవించిందని, ఒకరు మృతి చెందగా, ఐదు మంది గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన‌ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment