ప్రభుత్వం కంటే శక్తిమంతుడిగా పాక్ ఆర్మీ చీఫ్

ప్రభుత్వం కంటే శక్తిమంతుడిగా పాక్ ఆర్మీ చీఫ్

పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యం దాదాపుగా అంతరించి, సైనిక పెత్తనం అధికారికంగా బలపడింది. పాకిస్తాన్ (Pakistan) అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ (Asif Ali Zardari) గురువారం ఆమోదించిన 27వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ (Asim Munir) కు అపరిమిత అధికారాలు కట్టబెట్టబడ్డాయి. ఈ కొత్త చట్టం ద్వారా, మునీర్ ఆర్మీతో పాటు నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు కూడా అధిపతిగా, త్రివిధ దళాలకు సుప్రీం కమాండర్‌గా మారారు. ఇంతకు ముందు పౌర ప్రభుత్వం (Civilian Government),, అధ్యక్షుడి చేతిలో ఉన్న అణు శక్తి, ఇతర కీలక సైనిక నిర్ణయాలు ఇప్పుడు ఆయన నియంత్రణలోకి వచ్చాయి.

ఈ చట్టం ఆర్మీ చీఫ్‌ను చట్టాలకు అతీతుడిగా (Imune from law) మార్చింది. పాకిస్తాన్ చరిత్రలో రెండవ ‘ఫైవ్-స్టార్ జనరల్’ ర్యాంక్ అధికారిగా మునీర్ జీవితాంతం యూనిఫామ్‌లోనే ఉండి, తమ అధికారాలను నిలుపుకుంటారు. ఏ కోర్టు కూడా ఆయనను విచారించి శిక్షించలేదు.

పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంటే తప్ప ఆయనను పదవి నుంచి తొలగించడం సాధ్యం కాదు. ఈ అధికారాలన్నీ ఆయన్ని పౌర ప్రభుత్వం కన్నా అత్యున్నతుడిగా నిలబెట్టాయి. మరోవైపు, కొత్తగా ఏర్పాటు చేయబడిన ఫెడరల్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ (FCC) కారణంగా సుప్రీంకోర్టు అధికారాలకు భారీగా కోత పడింది. దీంతో సుప్రీంకోర్టు కేవలం సివిల్, క్రిమినల్ కేసుల అప్పీల్ కోర్టుగా మాత్రమే పరిమితమైంది.

Join WhatsApp

Join Now

Leave a Comment