భారత్‌ చ‌ర్య‌ల‌కు భ‌య‌ప‌డుతున్న పాక్ మీడియా

భారత్‌ చ‌ర్య‌ల‌కు భ‌య‌ప‌డుతున్న పాక్ మీడియా

భారత్ యుద్ధ సన్నద్ధతపై వస్తున్న వార్తలు ఇప్పుడు పాకిస్తాన్ మీడియాను తీవ్ర ఆందోళనలోకి నెట్టేశాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. పాక్ టీవీ ఛానళ్లలో భారత గూఢాచార సంస్థలు, ఇజ్రాయెల్ మొసాద్ (ఇజ్రాయెలీ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీలోని ప్రధాన సంస్థలలో ఒకటి) కలిసి కశ్మీర్‌లో అత్యాధునిక ఆయుధాల ప్రాజెక్టులు చేపడుతున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

“భారత్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను యాక్టివేట్ చేసింది, పాకిస్తాన్‌పై భారీ విధ్వంసానికి సిద్ధమవుతోంది” అంటూ ప్రసారమవుతున్న ఈ కథనాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. యుద్ధ స‌న్న‌ద్ధ‌త‌పై భారత్‌ సరైన సమాచారం అందించకుండా గోప్యంగా ఉంచుతుంద‌న్న విమర్శలతోపాటు, పాక్ వర్గాల్లో భయం, అనిశ్చితి కూడా వ్యక్తమవుతోంది. ఇలాంటి వార్తల నేపథ్యంలో, రెండు దేశాల మద్య నెలకొన్న ఉద్రిక్తతలపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరుగుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment