ఎంఐఎం (AIMIM) అధినేత, హైదరాబాద్ (Hyderabad) ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వక్ఫ్ బిల్లు (Waqf Bill) కు మద్దతు ఇచ్చినందుకు చంద్రబాబు, బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) , చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) లను తాను ఎప్పటికీ క్షమించబోనని స్పష్టం చేశారు.
బీజేపీకి వీళ్లు మార్గం చూపిస్తున్నారు
వక్ఫ్ బిల్లును మద్దతు ఇవ్వడం ద్వారా ఈ నేతలు బీజేపీ (BJP) కి సహకరిస్తున్నారని, ముస్లింల (Muslims) విశ్వాసంపై దాడికి వీళ్లు అవకాశమిస్తూన్నారని విమర్శించారు. ఈ నలుగురు ఎన్డీయే (NDA) కు వ్యతిరేకంగా నిలిచివుంటే, వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. చంద్రబాబు, నితీశ్, చిరాగ్ పాశ్వాన్‌ల నుంచి ఈ వ్యాఖ్యలపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.