మనాలీలో మంచు బీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్‌

మనాలీలో మంచు బీభత్సం.. భారీగా ట్రాఫిక్ జామ్‌

జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లో కురుస్తున్న విపరీతమైన మంచు కారణంగా రహదారులపై ట్రాఫిక్ జామ్‌ల సమస్య భారీగా ఏర్పడింది. ప్రత్యేకంగా పర్యాటక ప్రాంతాలు అయిన మనాలీ మరియు సిమ్లా మార్గాల్లో వేలాది వాహనాలు మంచులో చిక్కుకుని రోడ్లపైనే నిలిచిపోయాయి.

ఎటుచూసినా మంచు దుప్పటి పరుచుకుని దృశ్యాలను అందంగా క‌నిపించిన‌ప్ప‌టికీ, ఈ హిమపాతం స్థానికులు మరియు పర్యాటకులకు తీవ్రమైన ఇబ్బందులకు కారణమైంది. ముఖ్యంగా రోహతంగ్ పాస్‌లోని సొలాంగ్–అటల్ టన్నెల్ మధ్య దాదాపు వెయ్యికి పైగా వాహనాలు ఎక్కడిక్కడ చిక్కుకుపోయాయి.

సహాయక చర్యలు ప్రారంభం
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు మరియు అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారు. 700 మందికి పైగా పర్యాటకులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రత్యేక బృందాలు పని చేశాయి. ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాలు మంచు విపత్తుతో ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి పర్యాటకులకు ఆందోళన కలిగిస్తోంది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా, పలు రహదారులను తాత్కాలికంగా మూసివేసి, రోడ్లను మళ్లీ ఉపయోగించగలిగేలా చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment