కుప్పకూలిన కరాచీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్

కుప్పకూలిన కరాచీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్

పాకిస్తాన్ (Pakistan), పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాదుల (Terrorist) స్థావరాలపై భారత సైన్యం (Indian Army) “ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor)” పేరుతో దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 80 మందికి పైగా చనిపోయినట్లు సమాచారం. అయితే, ఈ దాడి ప్రభావం పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌ (Pakistan Stock Market)పై తీవ్రంగా పడింది. పాకిస్తాన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ (Index) అయిన కరాచీ-100 (KSE-100) సూచీ బుధవారం తెల్లవారుజామున ప్రారంభ ట్రేడింగ్‌లో 6,272 పాయింట్లు (6%) మేర నష్టపోయింది. మంగళవారం ముగింపు స్థాయి 113,568.51 నుంచి 107,296.64 కు పడిపోయింది. ఇదిలా ఉంటే, పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత KSE-100 సూచీ 3.7 శాతం క్షీణించగా, అదే సమయంలో దేశీయ మార్కెట్ అయిన ఇండియన్ సెన్సెక్స్ 1.5 శాతం పెరిగింది.

జమ్మూ & కాశ్మీర్ ఉగ్రవాద దాడి
2025 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ & కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, పాకిస్తాన్ స్టాక్ మార్కెట్‌లో KSE-100 సూచిక సుమారు 4 శాతం క్షీణించింది. ఉగ్రవాద దాడి కారణంగా భారత్-పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది.

భారత స్టాక్ మార్కెట్
ఇక భారత స్టాక్ మార్కెట్ (Indian stock market) విషయానికి వస్తే, బుధ‌వారం ఉదయం ప్రారంభంలోనే మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల నాటికి, సెన్సెక్స్ కేవలం 32 పాయింట్ల నష్టంతో కొనసాగగా, నిఫ్టీ 50 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అయితే, అనంతరం మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment