మహిళ(Woman)పై పోలీసు అధికారి(Police Officer) దౌర్జన్యానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ప్రకాశం జిల్లా(Prakasam District) కొండపి మండలం జాళ్లపాలెం గ్రామం (Jallapalem Village)లో కిరాణాషాప్ (Grocery Shop)నిర్వహిస్తున్న మారం రెడ్డి కొండల్‌రావు (Maram Reddy Kondalrao)ఇంట్లోకి చొరబడిన మర్రిపూడి ఎస్సై (Marripudi SI) రమేష్ బాబు(Ramesh Babu) తన బృందంతో కలిసి హల్‌చల్ చేశాడు. ఇంట్లోకి అనుమతి లేకుండా చొరబడటమే కాకుండా కొండల్‌రావు చెల్లెలి (Kondalrao’s Sister)పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు సీసీటీవీ డీవీఆర్(CCTV DVR)ను యజమాని పర్మిషన్ లేకుండా తీసుకెళ్లాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బాధితుల వివరాల ప్రకారం..
మారం రెడ్డి కొండల్‌రావు జాళ్లపాలెం గ్రామంలోని తన ఇంటిలోనే కిరాణా షాప్ నిర్వహిస్తున్నాడు. మర్రిపూడి మండలంలో పలు ఆలయాల్లో దొంగతనాలు జరిగాయని, సీసీటీవీ ఫుటేజీని చెక్ చేయాలని చెప్పుకుంటూ ఎస్సై రమేష్ బాబు మే 28వ తేదీ ఉదయం కొండలరావు ఇంటికి వచ్చాడు. అప్పటికి కొండల్‌రావు ఇంట్లో లేకపోవడంతో, ఆయన చెల్లెలు మరియు పిల్లలు (Children) ఎస్సైతో మాట్లాడారు. ఇంటి యజమాని ఊర్లో లేడు.. దయచేసి తన అన్న కొండల్‌రావుతో ఫోన్‌లో సంప్రదించి, ఆయన అనుమతితో సీసీ టీవీ ఫుటేజీని చెక్ చేసుకోండి అని చెప్పి ఫోన్ కలిపింది.
ఎస్సైతో ఫోన్‌లో మాట్లాడిన కొండల్‌రావు, తాను ఇంట్లో లేనప్పుడు ఎవరినీ అనుమతించలేనని, సాయంత్రం తిరిగి వచ్చాక సీసీటీవీ ఫుటేజీని పెన్ డ్రైవ్‌లో తీసి స్టేషన్‌కు పంపుతానని లేదా పోలీసులు తాను ఉన్నప్పుడు స్వయంగా వచ్చి చెక్ చేసుకోవచ్చని తెలిపాడు. గతంలో ఓ ఫిర్యాదు సందర్భంగా ఈ ఎస్సై న్యాయం చేయకపోగా నిందితుల వైపు నిలబడ్డారని, అందుకే తనపై కేసు బనాయించేందుకు గంజాయి వంటి వస్తువులను ఇంట్లో పెట్టే అవకాశం ఉందని కొండల్‌రావు అనుమానం వ్యక్తం చేశాడు. గ్రామస్తుల సమక్షంలోనే ఇంట్లోకి రావాలని ఆయన కోరాడు.
ఇంట్లోకి చొరబడి ఎస్సై దౌర్జన్యం
ఈ విషయంపై ఎస్సై రమేష్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ “నీ అనుమతి అవసరం లేదు” అంటూ ఇంట్లోకి బలవంతంగా చొరబడే ప్రయత్నం చేశాడు. తలుపు మూసేందుకు ప్రయత్నించిన కొండలరావు చెల్లెల్ని రెండు చేతులతో పట్టుకొని బలంగా నెట్టివేశాడు. అక్కడే ఉన్న కొండల్‌రావు పిల్లలను వేలు చూపిస్తూ బెదిరించి, “మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి” అంటూ సీసీటీవీ డీవీఆర్‌ను తీసుకొని వెళ్లిపోయాడు.
ఉన్నతాధికారులకు ఫిర్యాదు
ఈ ఘటనపై కొండలరావు స్థానిక సీఐకి ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఆయన జిల్లా ఎస్పీకి గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడటం సమాజంలో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కిరాణాషాప్‌లో పోలీసుల దౌర్జన్యానికి సంబంధించిన వీడియోను వైసీపీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.
రాష్ట్రంలో పౌరులపై రాజ్య హింస ప్రకాశం జిల్లాలో వెలుగు చూసిన మరో ఘటన రాష్ట్రంలో ఆటవిక పరిస్థితులు
— YSR Congress Party (@YSRCParty) June 2, 2025
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిడం ఒక అలవాటుగా చేసుకున్న పోలీసులు సామాన్య పౌరులమీద కూడా అదే రకంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా ప్రకాశం… pic.twitter.com/k0e34KMbK6







