టైటిల్: ఓజీ(OG)
నటీనటులు: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, సుదేవ్ నాయర్, రాహుల్ రవీంద్రన్ తదితరులు
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
నిర్మాతలు: డీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
సినిమాటోగ్రఫీ: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
ఎడిటర్: నవీన్ నూలి
కథేమిటంటే
1970–90ల కాలాన్ని ఆధారంగా తీసుకొని తెరకెక్కిన ఈ కథలో, జపాన్‌లో జరిగిన దాడి నుంచి బయటపడ్డ ఓజాస్ గంభీర (పవన్ కళ్యాణ్)(Pawan Kalyan) ఇండియా(India)కు చేరుకుంటాడు. అక్కడ సత్యాలాల్ అలియాస్ సత్యదాదా (ప్రకాశ్ రాజ్)పై దాడి జరిగితే రక్షిస్తాడు. దీంతో అతడిని బొంబాయికి తీసుకెళ్లి తన సహచరుడిగా చేసుకుంటాడు. క్రమంగా సత్యదాదా పోర్ట్ నిర్మాణం చేసి డాన్‌గా ఎదుగుతాడు. ఓజీ అతని వెన్నంటి ఉంటాడు.
కానీ ఒక సంఘటన తర్వాత ఓజీ ముంబైని వదిలి, నాసిక్‌లో డాక్టర్ కన్మణి (ప్రియాంక మోహన్)తో కొత్త జీవితం మొదలు పెడతాడు. ఇదే సమయంలో సత్యదాదా శత్రువులు, అతని పిల్లలు జిమ్మీ (సుదేవ్ నాయర్), ఓమీ (ఇమ్రాన్ హష్మీ) అతని సామ్రాజ్యంపై దాడి చేస్తారు. అలా మళ్లీ సత్యదాదాకు ఓజీ అవసరం వస్తుంది. ఓజీ తిరిగి వచ్చి సత్యదాదా కోసం యుద్ధం చేశాడా? ఓమీ కంటేనర్‌లోని రహస్యం ఏంటి? సత్యదాదా కుమారుల మరణం వెనుక నిజాలు ఏంటి? ఇవన్నీ సినిమా చూస్తేనే తెలుస్తాయి.

ఎలా ఉందంటే
గ్యాంగ్‌స్టర్ సినిమాలు ఇప్పటికే చాలానే వచ్చినా, ఓజీ ప్రారంభం ఆసక్తిగా ఉంటుంది. పవన్ ఎంట్రీ, ఎలివేషన్ సీన్లు ఫ్యాన్స్‌కి కిక్ ఇస్తాయి. కానీ కథనంలో కొత్తదనం తక్కువగా ఉంటుంది. మొదటి భాగంలో కథ రొటీన్‌గా ఉన్నా, ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం మాస్ ఆడియన్స్‌ని ఊరించేలా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో ఊహించిన విధంగానే కథ సాగుతుంది. ఎమోషనల్ సీన్లలో లోపం కనిపిస్తుంది. ముఖ్య పాత్రలు చనిపోయినా ప్రేక్షకుల మనసులో అంతగా అనుభూతి కలగదు. క్లైమాక్స్‌లో పార్ట్ 2కి హింట్ ఇచ్చారు.
నటన విషయానికి వస్తే
పవన్ కళ్యాణ్: వింటేజ్ లుక్‌లో కనిపించి ఫ్యాన్స్‌కి ఫీస్ట్ ఇచ్చారు. కానీ ఎక్కువ సీన్లు డూప్‌తో మేనేజ్ చేసినట్లు స్పష్టమవుతుంది.
ఇమ్రాన్ హష్మీ: విలన్‌గా బాగానే న్యాయం చేశాడు.
ప్రియాంక మోహన్: తక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నా తన వంతు న్యాయం చేసింది.
ప్రకాశ్ రాజ్: సత్యదాదాగా తనదైన శైలిలో ఆకట్టుకున్నారు.
శ్రియా రెడ్డి: మరోసారి పవర్‌ఫుల్ రోల్‌లో మెప్పించింది.

టెక్నికల్‌గా
తమన్ సంగీతం: సినిమా బలం. రొటీన్ సీన్లకే ఆయన బీజీఎం హైప్ తెచ్చింది.
సినిమాటోగ్రఫీ: విజువల్స్ రిచ్‌గా కనిపించాయి.
యాక్షన్ సీన్లు: స్టైలిష్‌గా ఉన్నా, కొంత లాజిక్ దెబ్బతిన్నాయి.
వీఎఫ్ఎక్స్: కొన్ని చోట్ల బలహీనంగా కనిపించింది.
ఎడిటింగ్: పర్వాలేదు.
నిర్మాణ విలువలు గ్రాండ్‌గా కనిపించాయి.
ఫైనల్ వెర్డిక్ట్
ఓజీ పూర్తిగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా. కథ రొటీన్, ఎమోషన్స్ బలహీనంగా ఉన్నా, హీరో ఎలివేషన్ సీన్లతో మాస్ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేసింది. వింటేజ్ పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ బీజీఎం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణలు. క్లైమాక్స్‌లో సెట్ చేసిన పార్ట్ 2 అంచనాలను పెంచింది.








