ఓజీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. అభిమానుల‌కు షాక్‌

ఓజీ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. అభిమానుల‌కు షాక్‌

టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన ‘OG’ చిత్రం క‌లెక్ష‌న్ల ప‌రంగా అభిమానుల‌ను నిరాశ‌ప‌రిచింది. విడుదలైన తొలి రోజు బాక్సాఫీస్ వ‌ద్ద అనుకున్నంత కలెక్షన్లు వ‌సూలు చేయ‌లేక‌పోయింది. ఈ సినిమా ప్రీమియర్స్, మొదటి రోజు వసూళ్లలో కొన్ని రికార్డులను అందుకోవడంలో ఘోరంగా విఫలమై, ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశపరిచింది.

ఈ సినిమాకు భారీ బడ్జెట్, ప్రముఖ నటులు, దర్శకులు ఉన్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో మునుపటి బ్లాక్‌బస్టర్‌లైన ‘RRR,’ ‘పుష్ప 2,’ ‘దేవర’ వంటి చిత్రాల మొదటి రోజు కలెక్షన్లను అధిగమించలేకపోయింది. ఇది పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాకు ఆశించిన ఫలితం రాలేదని చెప్పుకోవాలి.

ప్రాతాల వారీగా వసూళ్లను గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది:
ఉత్తరాంధ్ర: ‘OG’ – 6.70 కోట్లు, ‘పుష్ప 2 -. 7.70 కోట్లతో పోలిస్తే వెనుకబడి ఉంది.
గుంటూరు: ‘OG’ – 6.35 కోట్లు, ‘RRR’ – 7.80 కోట్ల
కృష్ణ: ‘పుష్ప 2’ కలెక్షన్ల కంటే ‘OG’ రూ. 30 లక్షలు తక్కువగా వసూలు చేసింది.
అత్యంత కీలకమైన ఈ ఏరియాలోనూ ‘OG’ రూ. 24.42 కోట్లు మాత్రమే సంపాదించగలిగింది, ఇది ‘పుష్ప 2’ కలెక్షన్ల కంటే దాదాపు రూ. 1 కోటి తక్కువ.

ఈ వివరాలు చూస్తుంటే, సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత గొప్పగా మొదలుకాలేదని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment