---Advertisement---

ఇన్వెస్టిగేషన్ థ్రిల్‌తో ‘ఆఫీసర్’ ట్రైలర్ రిలీజ్

ఇన్వెస్టిగేషన్ థ్రిల్‌తో ‘ఆఫీసర్’ ట్రైలర్ రిలీజ్
---Advertisement---

మలయాళ నటుడు కుంచాకో బోబన్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘ఆఫీసర్- ఆన్ డ్యూటీ’ తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమా మార్చి 7న థియేటర్లలో విడుదల కానుండగా, తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్
ట్రైలర్ చూస్తే, ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అని స్పష్టంగా తెలుస్తోంది. కుంచాకో బోబన్ ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుండగా, ఆయన పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. అలాగే, జేక్స్ బిజోయ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత ఉత్కంఠను కలిగిస్తోంది.

క్రైమ్ థ్రిల్లర్స్‌ను ఆస్వాదించే ప్రేక్షకులకు ‘ఆఫీసర్- ఆన్ డ్యూటీ’ సినిమా కొత్త అనుభూతిని ఇచ్చే అవకాశం ఉంది. మరి, సినిమాకి ట్రైలర్ ఇచ్చిన హైప్‌ను బాక్సాఫీస్ వద్ద నిలబెట్టగలదా? వేచి చూడాలి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment