వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్‌ను వెన‌క్కి నెట్టిన కోహ్లీ

వన్డే ర్యాంకింగ్స్.. రోహిత్‌ను వెన‌క్కి నెట్టిన కోహ్లీ

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. నిన్నటి సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన విరాట్ కోహ్లి ఒక స్థానం మెరుగుపరుచుకొని 4వ ర్యాంకుకు చేరుకున్నారు. అయితే, రోహిత్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 5వ స్థానానికి పడిపోయారు.

టాప్-3లో ఎవరు?
ప్రస్తుతం టాప్-3లో శుభ్‌మన్ గిల్, బాబర్ ఆజం, హెన్రిచ్ క్లాసెన్ నిలిచారు. ఈ క్రమంలో టాప్-5లో ముగ్గురు భారత ఆటగాళ్లు ఉండటం విశేషం. ఇక ఆల్రౌండర్ల విభాగంలో అక్షర్ పటేల్ 13వ స్థానంలో, బౌలర్ల విభాగంలో మహ్మద్ షమీ 11వ స్థానంలో కొనసాగుతున్నారు. ర్యాంకింగ్స్‌లో మరిన్ని మార్పులు జరగొచ్చన్న అంచనాలు ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment