‘నిజం గడప దాటే లోపు, అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది’ అనే సామెత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ సినిమా విషయంలో నిజమవుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel), హీరో ఎన్టీఆర్ (NTR) మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయనే ఒక వార్త పుట్టింది. అందులో ఎంతవరకు నిజం ఉందనే క్లారిటీ లేకపోయినా, కొందరు ఆ వార్తను రకరకాలుగా విస్తరిస్తూ ముందుకు తీసుకుపోతున్నారు. మరికొందరైతే ఏకంగా సినిమా ఆగిపోయిందంటూ కూడా వార్తలు రాసేశారు.
అయితే, వాస్తవానికి ఇలాంటి సమస్యలేవీ లేవని తెలుస్తోంది. అయినప్పటికీ, ఈ పుకార్లపై స్పష్టత ఇచ్చే విషయంలో ప్రశాంత్ నీల్ టీమ్ గానీ, ఎన్టీఆర్ టీమ్ గానీ ఆసక్తి చూపడం లేదు. ఇలా జరిగినా సినిమా గురించి చర్చ జరుగుతుందని భావిస్తున్నారో ఏమో తెలియదు గానీ, భవిష్యత్తులో ఇది సినిమాకు ఇబ్బంది కలిగించే అంశమే అవుతుంది.
కాబట్టి, ఈ విషయంలో ఒకసారి జూనియర్ ఎన్టీఆర్ లేదా ప్రశాంత్ నీల్ టీమ్స్ ముందుకు వచ్చి కొంతవరకు క్లారిటీ ఇస్తే బాగుంటుందని సినీ వర్గాల అభిప్రాయం. ‘డ్రాగన్’(Dragon) అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్టులో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాని హోంబాలే ఫిలిమ్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.








