జూ.ఎన్టీఆర్ పొలిటిక‌ల్‌ ఎంట్రీపై క్లారిటీ

జూ.ఎన్టీఆర్ పొలిటిక‌ల్‌ ఎంట్రీపై క్లారిటీ

నందమూరి హరికృష్ణ (Nandamuri Harikrishna) వర్ధంతి (Death Anniversary) సందర్భంగా ఆయనకు అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. 2018లో నల్గొండ జిల్లా (Nalgonda District) లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ (Harikrishna) మృతి (Death) చెందిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో జూనియర్ (Junior) ఎన్టీఆర్(NTR) పేరు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అనంతపురం తెలుగుదేశం పార్టీ(TDP) ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ (Daggubati Venkateswara Prasad) జూ.ఎన్టీఆర్‌పై చేసిన అస‌భ్య‌వ్యాఖ్యలతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు (Chandrababu)ను కలసి క్షమాపణ చెబుతారని ఊహించగా, అది జరగకపోవడంతో ఎన్టీఆర్ అభిమానులు టీడీపీకి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా అనే చర్చ మళ్లీ మొదలైంది. హరికృష్ణ వర్ధంతి కార్యక్రమంలో ఆయన కుమార్తె, జూ.ఎన్టీఆర్(Jr.NTR) సోద‌రి (Sister) నందమూరి సుహాసిని (Nandamuri Suhasini) ఈ విషయంపై స్పందించారు. మీడియాలో వచ్చిన ప్రశ్నలకు సమాధానంగా మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ, సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా రాజకీయాల్లోకి వస్తాడు” అని క్లారిటీ ఇచ్చారు.

హరికృష్ణ రాజకీయ వారసత్వాన్ని జూ.ఎన్టీఆర్ కొనసాగిస్తారా అనే ప్రశ్నకు సుహాసిని ఇచ్చిన ఈ సమాధానం అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు జూ.ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ త్వరలోనే చూస్తామనే నమ్మకంతో ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment