ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల ‘వార్ 2’ ట్రైలర్ విడుదల!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల 'వార్ 2' ట్రైలర్ విడుదల!

ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘వార్ 2’ ట్రైలర్ వచ్చేసింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ హిందీ చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో ‘వార్ 2’ ఒక భాగం.

ఇద్దరు గొప్ప స్టార్స్ మధ్య జరిగే అద్భుత పోరాటం ఎలా ఉండబోతుందో ట్రైలర్‌లో కనుల విందుగా చూపించారు. కియారా అద్వానీ కూడా యాక్షన్ ఎపిసోడ్స్‌తో పాటు గ్లామర్ పాత్రలో కనిపించనుంది.

ఈ సినిమా తెలుగు విడుదల హక్కులను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీ స్పై యూనివర్స్‌లో భాగంగా మరో అధ్యాయంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘పఠాన్’, ‘టైగర్ 3’, ‘వార్’ వంటి గ్లోబల్ హిట్ సినిమాల తర్వాత వస్తున్న ‘వార్ 2’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ఫార్మాట్‌లోనూ రిలీజ్ కానుందని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ పేర్కొంది.

Join WhatsApp

Join Now

Leave a Comment