ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2025 నోబెల్ శాంతి (Nobel Peace) బహుమతి (Prize) విజేతను శుక్రవారం నార్వేజియన్ నోబెల్ (Norwegian Nobel) కమిటీ ప్రకటించింది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారం మారియా కొరినా మచాడో (Maria Corina Machado)ను వరించింది.
ఆమె పోరాటానికి  నోబెల్ కమిటీ దాసోహం 
వెనిజులా (Venezuela)కు చెందిన మారియా కొరినా మచాడో, ఆ దేశంలో ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడంలో అవిశ్రాంతంగా కృషి చేశారు. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత పరివర్తనను సాధించడానికి ఆమె చేసిన పోరాటాన్ని గుర్తించిన నార్వేజియన్ నోబెల్ కమిటీ, ఆమెకు ఈ అత్యున్నత గౌరవాన్ని దక్కేలా చేసింది.
ట్రంప్‌కు మొండి చేయి
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆశలు పెట్టుకున్నారు. అయితే, నోబెల్ కమిటీ నుంచి ఆయనకు మొండి చేయి ఎదురైంది. దీంతో, సోషల్ మీడియాలో నెటిజన్లు “పాపం ట్రంప్” అంటూ పోస్టులు పెడుతున్నారు. ప్రపంచ శాంతికి కృషి చేసినందుకు గాను మారియా కొరినా మచాడోకు ఈ పురస్కారం దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.





 



