ప్రఖ్యాత రచయిత, నోబెల్ సాహిత్య బహుమతి విజేత (Nobel Prize in Literature) మారియో వర్గాస్ ల్లోసా (Mario Vargas Llosa) (89) మరణించారు (Passed Away). ఈ విషయాన్ని ఆయన కుమారులు సోమవారం అధికారికంగా ప్రకటించారు. లిమా (Lima) లో కుటుంబ సభ్యుల మధ్యలోనే తన చివరి శ్వాస విడిచినట్లు పెద్ద కుమారుడు (Eldest Son) అల్వారో వర్గాస్ ల్లోసా (Alvaro Vargas Llosa) సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
“మా తండ్రి వర్గాస్ ల్లోసా మరణించారు. ఆయన లిమాలో కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు కన్నుమూశారు” అని అల్వారో, గోన్సాలో, మోర్గానా వర్గాస్ ల్లోసా సంతకంతో కూడిన ప్రకటనలో పేర్కొన్నారు.
లాటిన్ అమెరికన్ సాహిత్యంలో ఓ శకం ముగిసింది
1960–70 దశకాల్లో లాటిన్ అమెరికన్ సాహిత్య బూమ్ (Latin American Literary Boom) ను ప్రభావితం చేసిన రచయితలలో వర్గాస్ ల్లోసా ఒకరు. కొలంబియాకు చెందిన గాబ్రియేల్ గార్సియా మార్కెస్, అర్జెంటీనాకు చెందిన జూలియో కార్ట్‌సార్ వంటి సాహిత్య దిగ్గజాలతో కలిసి ఆయన సాహిత్య ప్రపంచాన్ని ప్రేరేపించారు. మధ్య తరగతి పెరూ కుటుంబంలో జన్మించిన ల్లోసా, తన రచనల ద్వారా అంతర్జాతీయంగా పేరు సాధించారు.