కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘NKR21’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
ఈ చిత్రానికి ‘మెరుపు’, ‘రుద్ర’ అనే టైటిళ్లు ప్రచారంలో ఉండగా, మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నారు. ‘డెవిల్’ సినిమా తర్వాత సంవత్సరంగా స్క్రీన్‌కు దూరంగా ఉన్న కళ్యాణ్ రామ్ మళ్లీ మాస్ లుక్‌తో కనిపించనున్నాడు. ఇక, ఈ మూవీ నుంచి వరుస అప్డేట్స్ రాబోతున్నాయన్న వార్తలు అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేశాయి.