టీమిండియా యువ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మంగళవారం తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆచారాలను అనుసరిస్తూ, అలిపిరి కాలినడక మార్గంలో మోకాళ్ల పర్వతం దగ్గర మోకాళ్లపై మెట్లను ఎక్కి తన మొక్కును తీర్చుకున్నాడు. గోవింద నామస్మరణతో శ్రీవారి ఆలయంలోకి చేరుకున్న నితీశ్‌ను టీటీడీ పాలక బృందం ఘనంగా స్వాగతించింది. క్రికెటర్ నితీశ్ కుమార్ మోకాళ్ల పర్వతం ఎక్కిన వీడియో వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తిరుమల మెట్ల మార్గం, కొండపై భక్తులు నితీశ్‌తో ఫొటోలు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నుండి ఇంగ్లండ్ సిరీస్ వరకు
నితీశ్ కుమార్‌రెడ్డి, ఇటీవల జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొని మెల్‌బోర్న్ మైదానంలో సెంచరీ సాధించాడు. టాప్ రన్ స్కోరర్లలో ఒకడిగా నిలిచిన నితీశ్, ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగబోయే టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ నెల 22న ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో 5 టీ20 మ్యాచ్‌లు, మూడు వన్డేలు జరగనున్నాయి.