బాక్సింగ్ డే టెస్ట్‌లో ఆసిస్ బౌలర్లపై టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డాడు. దూకుడైన తన ఆట తీరుతో పెంచరీ పూర్తి చేసుకొని బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. యశస్వి మినహా టాప్ ఆర్డర్స్ అంతా విఫలమైనా.. నితీశ్, వాషింగ్టన్ సుందర్ టీమిండియా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి ఈ మ్యాచ్‌లో భారత్‌ను ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. టెస్ట్‌ల్లో తన తొలి సెంచరీని నమోదు చేసిన నితీశ్ అనంతరం నితీశ్ తగ్గేదే లే అంటూ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజంతో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇప్పుడా దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారాయి.
టీమిండియా ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కింది. భారత్ స్కోర్ బోర్డు 350 మార్కును దాటింది. నితీశ్, వాషింగ్టన్ సుందర్‌తో (50) కలిసి ఎనిమిదో వికెట్‌కు భారత్‌ను ఫాలో గండం నుంచి గట్టెక్కించారు. హాఫ్ సెంచరీ అనంతరం వాషింగ్టన్ సుందర్ స్లిప్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు. ఆ తరువాత వచ్చిన బూమ్రా (0) కమిన్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ప్రస్తుతం నితీశ్ 103 పరుగులతో (నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఇండియా 354 పరుగులు చేసి తొమ్మిది వికెట్లు నష్టపోయింది.
భారత ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ 82, విరాట్ కోహ్లి 36, కేఎల్ రాహుల్ 24, రోహిత్ శర్మ 3, ఆకాశ్‌దీప్ 0, రిషబ్ పంత్ 28, రవీంద్ర జడేజా 17 పరుగులకు ఔటయ్యారు. ఆసీస్ బౌలర్లలో బోలాండ్ 3, కమిన్స్ 3, లయోన్ రెండు వికెట్లు పడగొట్టారు.