ఆంధ్రప్రదేశ్ యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి, 21 సంవత్సరాల వయసులోనే ప్రపంచ స్థాయిలో ప్రతిభను చాటుకున్న నితీష్‌కు జగన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
“నితీష్ విజయానికి దేశం గర్వపడుతోంది. చిన్న వయసులోనే ఇంతటి గొప్ప విజయాన్ని సాధించడం నిజంగా విశేషం” అని జగన్ అన్నారు. నితీష్ ఈ ప్రదర్శనతో రాబోయే రోజులలో భారత క్రికెట్‌కు మరిన్ని విజయాలు అందిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.
మెల్‌బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో భారత క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీతో మెరిశారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కీలక ఇన్నింగ్స్ ఆడి.. తన తొలి సెంచరీని పూర్తి చేసుకున్నాడు.