2025లో జరగనున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల కోసం ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును బిహార్ బీజేపీ కోర్ కమిటీ అధికారికంగా ఖరారు చేసింది. హర్యానా రాష్ట్రంలోని సూరజ్‌కుండ్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో కమిటీ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించారు.
బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మాట్లాడుతూ.. “ఎన్డీయే కూటమిలోని ఐదు మిత్రపక్షాలు నితీశ్ కుమార్ పేరుకు పూర్తిగా మద్దతు తెలిపాయి. బిహార్ ప్రజల కోసం ఆయన నాయకత్వమే సరైనదని మేము భావిస్తున్నాం” అని తెలిపారు.
ఎన్డీయే వ్యూహం..
నితీశ్ కుమార్ బిహార్ ముఖ్యమంత్రిగా ఇప్పటికే అనేక సంవత్సరాలు సేవలందించి ప్రగతికి దారితీశారు. ఇప్పుడు, వచ్చే ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం ప్రకటించడం ఎన్డీయే కూటమి బలాన్ని మళ్లీ నిరూపించగలదా అనే అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బిహార్ మంత్రి ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ, “నితీశ్ కుమార్ నాయకత్వం కింద బిహార్ మరింత అభివృద్ధి సాధిస్తుందని మేము నమ్ముతున్నాం. ప్రజల మద్దతుతో విజయం సాధిస్తాం” అని తెలిపారు.