ఆస్ట్రేలియాపై టీమిండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చేసిన అద్భుత శతకం కేవలం అభిమానులనే కాదు, అతని తండ్రి ముత్యాల రెడ్డిని కూడా ఆనందంలో ముంచెత్తింది. తన కొడుకు తొలి సెంచరీని ప్రత్యక్షంగా చూసిన ఆ తండ్రి ఆనందంతో కన్నీటి పర్యంతమయ్యారు.
తండ్రి త్యాగానికి ఫలితం
నితీశ్ కుమార్ రెడ్డి విజయం వెనుక అతని తండ్రి ముత్యాల రెడ్డి సర్వం త్యజించిన త్యాగం దాగి ఉంది. కొడుకును క్రికెట్ ఆడడంలో ప్రోత్సహించేందుకు తన జీవితంలో అన్ని అవసరాల్ని పక్కన పెట్టిన తండ్రి, ఇప్పుడు అతని విజయాన్ని చూసి గర్వపడుతున్నారు.
మెల్‌బోర్న్ గ్రౌండ్‌లో తొలి సెంచరీ తరువాత నితీశ్ తండ్రి దృశ్యాలు చూసిన నెటిజన్లను సైతం భావోద్వేగానికి గురిచేస్తున్నాయి. “ఇంతకంటే గొప్ప పుత్రోత్సాహం ఏముంటుంది?” అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. కొడుకుకి తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ఇప్పుడు నితీశ్ విజయంలో ప్రతిఫలితమైందని అంటున్నారు.







