నితిన్ (Nithiin) హీరోగా నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ (‘Tammudu’) నుండి మరో ఉత్కంఠభరితమైన ట్రైలర్ (Trailer) విడుదలైంది. శ్రీరామ్ వేణు (Sriram Venu) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మొదటి ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన రావడంతో సినిమాపై ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. తాజాగా విడుదలైన ‘రిలీజ్ ట్రైలర్’ పేరుతో మరో పవర్ఫుల్ వీడియోను విడుదల చేసి చిత్ర బృందం అభిమానులను మరింత ఆశ్చర్యపరిచింది. ఈ కొత్త ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.
ఈ చిత్రంలో సప్తమి గౌడ రత్న పాత్రలో, వర్ష బొల్లమ్మ చిత్రగా, లయ ఝాన్సీ కిరణ్మయిగా, స్వసిక విజయన్ గుత్తి పాత్రలో, సౌరభ్ సచ్దేవ్ అగర్వాల్‌గా కనిపించబోతున్నారు. నితిన్ – దిల్ రాజు కాంబినేషన్లో ఇప్పటికే ‘దిల్’, ‘శ్రీనివాస కళ్యాణం’ వంటి విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లోనే శ్రీరామ్ వేణు ‘ఎంసీఏ’, ‘వకీల్ సాబ్’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. ఈ ముగ్గురి కాంబినేషన్లో వస్తున్న ‘తమ్ముడు’ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తోందని మేకర్స్ తెలిపారు.








