తన అందంతో కుర్రకారును హోరెత్తించే టాలీవుడ్ (Tollywood) నటి నిధి అగర్వాల్ (Nidhi Agarwal).. సోషల్ మీడియాలో వైరల్‌గా మారారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా హీరోయిన్ వీడియో ఉదయం నుంచి ట్రెండ్ అవుతోంది. అయితే అది పాజిటివ్‌గా కాదు, నెగిటివ్‌గా. ఇటీవల భీమవరం పర్యటన సందర్భంగా నిధి అగర్వాల్ ప్రయాణించిన కారు(Car) అందుకు కారణం. కాగా, వైరల్ అవుతున్న వీడియోపై నిధి అగర్వాల్ స్పందించారు. ఆ విషయంపై ప్రెస్‌నోట్ విడుదల చేశారు.
తాజాగా భీమవరం (Bhimavaram) లో స్టోర్ ప్రారంభోత్సవానికి (Store Inauguration) హాజరైనప్పుడు, స్థానిక నిర్వాహకులు ప్రయాణ సౌకర్యం కల్పించారని నిధి తెలిపారు. ఆ సందర్భంలో వారు అందించిన వాహనం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి (Government) చెందినదే అయినప్పటికీ, దానిని తాను ఎంచుకోవడం లేదా కోరుకోవడం జరగలేదని స్పష్టం చేశారు. కేవలం లాజిస్టిక్ సౌకర్యం కోసం నిర్వాహకులే వాహనం ఏర్పాటు చేశారని చెప్పారు.
“కొన్ని ఆన్‌లైన్ వార్తలు, సోషల్ మీడియాలో పోస్టులు – ఈ వాహనాన్ని ప్రభుత్వ అధికారులు నాకు పంపించారని చెబుతున్నాయి. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యం. ఈ సందర్భంలో నాకు ఎలాంటి ప్రభుత్వ అధికారులతో సంబంధం లేదు. వాహనం వినియోగం కూడా వారితో సంబంధం లేకుండా జరిగింది” అని నిధి అగర్వాల్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ వాహనాన్ని ఎవరు సమకూర్చారనేది పెద్ద ప్రశ్నగా మారింది. దీనిపై నిర్వాహకులే క్లారిటీ ఇవ్వాల్సి ఉందని నిధి ఫ్యాన్స్ కోరుతున్నారు.







