సినీ పరిశ్రమలో విజయం సాధించాలంటే ప్రతిభతో పాటు అదృష్టం కూడా ఉండాలి అంటారు. ఈ మాట నిధి అగర్వాల్ విషయంలో అక్షరాలా నిజమైందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అందం, అభినయం ఉన్నా ఆమెకు అదృష్టం కలిసి రావడం లేదనిపిస్తోంది.
‘సవ్యసాచి’ సినిమాతో తెలుగులో అడుగుపెట్టిన నిధి, తొలి చిత్రంలోనే తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’తో భారీ విజయం అందుకున్నా కూడా ఆమెకు స్టార్ హీరోయిన్ హోదా దక్కలేదు. దీంతో వచ్చిన అవకాశాలను చేసుకుంటూ ముందుకు సాగింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ చిత్రంలో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాతో ఆమె దశ మారుతుందని అందరూ భావించారు. కానీ, ఆ సినిమా ఆశించిన విజయం సాధించకపోవడంతో ఆమెకు కలిసొచ్చింది ఏమీ లేదు.
‘హరిహర వీరమల్లు’ తర్వాత నిధి అగర్వాల్ నటించిన మరో పాన్-ఇండియా చిత్రం ‘మిరాయ్’. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్‌లో ఆమె నటించింది. ఆర్య సినిమాలో ‘అంటే అమలాపురం’ తరహాలో ఈ పాటను రూపొందించినట్లు సమాచారం. అయితే, కథనానికి అడ్డుగా ఉందని భావించిన నిర్మాతలు ఈ పాటను సినిమా నుంచి తొలగించారు. ఒకవేళ ఈ పాట ఉండి ఉంటే, ‘మిరాయ్’ విజయం నిధి అగర్వాల్ కెరీర్‌కు బాగా ఉపయోగపడేది. కానీ, దురదృష్టవశాత్తూ ఆ పాటను రెండో భాగంలో లేదా ఓటీటీలో కూడా విడుదల చేయమని మేకర్స్ చెప్పడం నిధి అభిమానులను నిరాశపరిచింది.
ఇప్పుడు నిధి అగర్వాల్ ఆశలన్నీ ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాపైనే ఉన్నాయి. ఈ చిత్రంలో ఆమె ఒక కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆమె పోస్టర్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా తన బ్యాడ్ లక్‌ను తొలగిస్తుందని నిధి ఎదురుచూస్తోంది. ఈ సినిమా అయినా ఆమెకు విజయాన్ని అందించి, స్టార్ హీరోయిన్గా నిలబెడుతుందో లేదో చూడాలి.