హరిహర వీరమల్లు (Harihara Veeramallu) హీరోయిన్ (Heroine) కారు (Car) ప్రయాణం (Journey) తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇటీవల ఏపీకి వచ్చిన నటి నిధి అగర్వాల్ (Nidhi Agarwal) ఎమ్మెల్యేలు, అధికారులు ప్రయాణించే ప్రభుత్వ వాహనం (Government Vehicle)లో సినీ నటి ప్రయాణించడం ఈ వివాదానికి కారణం. ఇటీవల విజయవాడ (Vijayawada)కు వచ్చిన సినీ నటి నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ డ్యూటీ వాహనంలో ప్రయాణించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలు బయటకు రావడంతో, ప్రజల పన్నులతో నడిచే అధికారిక వాహనాలను ఇతరుల కోసం ఉపయోగించడం సమంజసమేనా అనే ప్రశ్నలు నెటిజన్లు లేవనెత్తుతున్నారు.
ఆన్‌లైన్‌లో ఈ విషయం వేడెక్కి చర్చకు దారి తీస్తోంది. కొందరు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు (Fans) ఈ విషయాన్ని సమర్థించే ప్రయత్నం చేస్తుండగా, ఎక్స్‌లోని గ్రోక్ (Grok) కూడా ఇది ప్రభుత్వ వాహనమేనని, ప్రభుత్వ వనరుల దుర్వినియోగం జరుగుతోందని పేర్కొనడం సంచలనం రేపింది.
నిధి అగర్వాల్ ప్రభుత్వ అధికారి కాదు, ఎన్నికైన ప్రజాప్రతినిధి కూడా కాదు. మరి ‘హరి హర వీర మల్లు’ హీరోయిన్ అధికారిక వాహనంలోకి ఎలా ఎక్కారు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రజలు కట్టే పన్నుతో సినిమా ప్రముఖులను ప్రభుత్వ వాహనాల్లో తిప్పడం తగదని విమర్శిస్తున్నారు. కొందరు పవన్ కళ్యాణ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ “రూల్స్ పెడతారు కానీ ఫాలో అవ్వరా మీరు” అని కామెంట్లు చేస్తున్నారు. అధికార దుర్వినియోగం గురించి లెక్చర్ ఇచ్చే పవన్ కళ్యాణ్.. తన సినిమాలోని హీరోయిన్‌ను ప్రభుత్వ వాహనంలో ఎలా తిప్పుతున్నారని ప్రశ్నిస్తున్నారు. నిధి అగర్వాల్ వీడియో సోషల్ మీడియాలో ఇంకా వైరల్ అవుతూనే ఉంది.







