---Advertisement---

పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రూ.25 కోట్ల డ్రగ్స్ సీజ్

పోలీసుల స్పెషల్ డ్రైవ్.. రూ.25 కోట్ల డ్రగ్స్ సీజ్
---Advertisement---

న్యూఇయర్ సందర్భంగా పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. దేశవ్యాప్తంగా డ్రగ్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాల‌తో రాష్ట్ర ప్ర‌భుత్వాలు స్పెష‌ల్ డ్రైవ్‌లు నిర్వ‌హిస్తున్నాయి.

చెన్నై పట్టణ పరిధిలోని మాధవరం పోలీసు స్టేషన్ సిబ్బంది ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో డ్ర‌గ్స్ త‌ర‌లిస్తున్న ముగ్గురిని పోలీసులు గుర్తించి వారి వ‌ద్ద నుంచి రూ.25 కోట్ల విలువైన 16 కిలోల నిషేధిత డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల హెచ్చరిక
ఈ ఘటన ఆధారంగా.. ఎయిర్‌పోర్టుల నుంచి ఓడరేవుల వరకు కస్టమ్స్ అధికారులు, నార్కొటిక్ బ్యూరో అధికారుల జాగ్రత్తలు మరింత కఠినతరం అవుతున్నాయి. డ్రగ్స్ వ్యాప్తి అరికట్టడంలో ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment