ఆదిభట్లలో రతన్ టాటా మార్గ్

ఆదిభట్లలో రతన్ టాటా మార్గ్

హైదరాబాద్ శివారు ఆదిభట్ల మున్సిపాలిటీలోని నూత‌నంగా నిర్మించిన రోడ్డుకు టాటా సంస్థ వ్య‌వ‌స్థాప‌కులు స్వ‌ర్గీయ రతన్ టాటా పేరును ఖ‌రారు చేశారు. ORR బొంగ్లూరు నుంచి ఆదిభట్ల పట్టణానికి నిర్మించిన ఈ రోడ్డుకు “రతన్ టాటా మార్గ్” అని నామకరణం చేయాలని మున్సిపల్ ఛైర్మన్ నిరంజన్ రెడ్డి ప్రకటించారు.

2024 అక్టోబర్ 9న స్వర్గస్తులైన రతన్ టాటా భారత పారిశ్రామిక రంగానికి, దేశానికి అందించిన అపార సేవలకు గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. రోడ్డుకు పేరు మాత్ర‌మే కాకుండా, రతన్ టాటా విగ్రహాన్ని ఈ ప్రాంతంలో నెలకొల్పుతామని కూడా మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారు.

రతన్ టాటా పేరుతో ఈ రోడ్డు స్థానిక ప్రజలకు కేవలం ప్రయాణ మార్గంగా కాకుండా, ఆయన సేవలను గుర్తు చేసుకునే మార్గదర్శిగా నిలుస్తుందని భావిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment