రెండున్నర శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన నెల్లూరు (Nellore) వీఆర్ హైస్కూల్‌ను ఆధునీకరించి, మోడల్ పాఠశాలగా (Model School) తీర్చిదిద్దామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. సోమవారం వీఆర్ హైస్కూల్ (VR High School)ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు లోకేష్, పొంగూరు నారాయణ (Ponguru Narayana), ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మూతపడిన ఈ పాఠశాలను తిరిగి తెరిపించి, అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశామని చెప్పారు.
మంత్రి లోకేష్ మాట్లాడుతూ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నారాయణ మాస్టర్ లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలు మూసివేయాలని, కానీ అది కాదు.. ఆయన లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి, ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించాలనేది నారాయణ లక్ష్యం అని విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కార్పొరేట్ విద్యా సంస్థలను నడుపుతున్న మంత్రి నారాయణ లాంటి వ్యక్తి ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోరుకుంటారా..? అని ప్రశ్నిస్తున్నారు.
గతంలో సీఎం చంద్రబాబు మంత్రి నారాయణ కూతురు రాసిన మైండ్‌సెట్ బుక్ (Mindset Book) రిలీజ్ ఫంక్షన్ (Release Function)లో నారాయణ విద్యా సంస్థలు చాలా గొప్పవి అని చెప్పారు. సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం తన ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల పనితీరును పరోక్షంగా నిరాశ పరిచినట్లేనని గతంలో అనేక అభ్యంతరాలు, అభిప్రాయాలు వెల్లడయ్యాయి. మంత్రి లోకేష్ సైతం ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య అందించడమే నారాయణ లక్ష్యం అని చెప్పడం హాస్యాస్పదం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.







