కుబేర మూవీ త‌ర‌హాలో నెల్లూరులో భారీ స్కామ్‌

కుబేర మూవీ త‌ర‌హాలో నెల్లూరులో భారీ స్కామ్‌

నెల్లూరు (Nellore)లో కుబేర (Kubera) మూవీ(Movie) తరహాలో జ‌రిగిన భారీ లోన్ (Loan) కుంభ‌కోణం (Scam) వెలుగులోకి వ‌చ్చింది. అమాయక గిరిజనులను (Innocent Tribals) టార్గెట్ చేసిన కేటుగాళ్లు యాక్సిస్ బ్యాంక్‌ (Axis Bank)ను ఆధారంగా చేసుకుని సుమారు రూ.10.60 కోట్ల మేర కొల్ల‌గొట్టారు. లోన్లు ఇప్పిస్తామంటూ ఫేక్ కంపెనీలు (Fake Companies) సృష్టించి 56 మందికి పైగా గిరిజనుల‌ను ఆ కంపెనీల ఉద్యోగులుగా చూపించి లోన్లు మంజూరు చేయించి ఆ డ‌బ్బును వారికి తెలియ‌కుండా మింగేశారు.

2022 నుంచి 2024 మధ్యకాలంలో జ‌రిగిన ఈ భారీ స్కామ్‌ను అమలు చేయడంలో కేటుగాళ్లు అనేక ట్రిక్కులు ప్లే చేశారు. ఫేక్ కంపెనీ పేరిట గిరిజనులకు ఆరు నెలల పాటు జీతాలు చెల్లించినట్లు బ్యాంక్ స్టేట్మెంట్లు తయారు చేశారు. దీంతో యాక్సిస్ బ్యాంక్ అధికారులు వారు నిజంగా ఉద్యోగులేనని నమ్మి వారి పేర్లపై భారీగా లోన్లు మంజూరు చేశారు. ఇప్పుడు ఆ లోన్ల(Loans) రికవరీ (Recovery) కోసం బ్యాంక్ గిరిజనులకు నోటీసులు(Notices) పంపించడంతో మోసం వెలుగులోకి వచ్చింది.

2024లో బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ మదన్ మోహన్ (Madan Mohan) ముత్తుకూరు (Muthukuru) పోలీస్ స్టేషన్‌ (Police Station)లో వాసుదేవ నాయుడు, అల్లాభక్షు, శివ, వెంకట్ అనే వ్యక్తులపై ఫిర్యాదు చేశారు. ఈ మోసంలో బ్యాంకు ఉద్యోగుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విచారణలో వీరి పాత్ర స్పష్టమవ్వనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment